దివ్యతేజ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం: నిందితుడిని శిక్షిస్తామని సీఎం జగన్ హామీ

By narsimha lodeFirst Published Oct 20, 2020, 5:18 PM IST
Highlights

ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 

విజయవాడ:  ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 

మంగళవారం నాడు మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో  దివ్యతేజ పేరేంట్స్ సీఎంను కలిశారు.  దివ్యతేజ హత్యకు దారితీసిన పరిస్థితులను  సీఎం అడిగి తెలుసుకొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

also read:సీఎం జగన్‌తో దివ్యతేజ పేరేంట్స్ భేటీ: నిందితుడిపై చర్యలకు డిమాండ్

తమ కుటుంబానికి న్యాయం జరుగుతోందని భరోసా కల్గిందని దివ్యతేజ తండ్రి మీడియాకు చెప్పారు. సీఎం ను కలిసి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హోం మంత్రి సుచరిత కూడ తమ కుటుంబానికి భరోసాను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందనే తమకు నమ్మకం కలిగిందని ఆయన చెప్పారు.  ఈ నెల 15వ తేదీన నాగేంద్రబాబు ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజను హత్య చేశారు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
 

click me!