ఏపీలో కొత్తగా 3,503 మందికి పాజిటివ్: 7.89 లక్షలకు చేరిన కేసుల సంఖ్య

By Siva Kodati  |  First Published Oct 20, 2020, 7:19 PM IST

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,503 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కి చేరింది.


ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,503 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కి చేరింది. అనంతపురం 123, చిత్తూరు 459, తూర్పు గోదావరి 457, గుంటూరు 387, కడప 190, కృష్ణ 398, కర్నూలు 48, నెల్లూరు 182, ప్రకాశం 308, శ్రీకాకుళం 94, విశాఖపట్నం 240, విజయనగరం 93, పశ్చిమ గోదావరిలలో 524 కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్కరోజే కొత్తగా 28 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,481కు చేరుకుంది.

Latest Videos

undefined

చిత్తూరు జిల్లాలో నలుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

గత 24 గంటల్లో 5,144 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 7,49,676కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 33,396 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,095 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 71,96,628కి చేరింది. 

 

 

: 20/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,86,658 పాజిటివ్ కేసు లకు గాను
*7,46,781 మంది డిశ్చార్జ్ కాగా
*6,481 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 33,396 pic.twitter.com/QRCCbZwqHw

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!