విజయవాడలో ఆన్‌లైన్ సెక్స్‌రాకెట్: 40 మంది ఫోటోలతో అత్తా అల్లుళ్ల బాగోతం

Published : Aug 15, 2018, 01:26 PM ISTUpdated : Sep 09, 2018, 01:37 PM IST
విజయవాడలో ఆన్‌లైన్ సెక్స్‌రాకెట్:  40 మంది ఫోటోలతో అత్తా అల్లుళ్ల బాగోతం

సారాంశం

సోషల్ మీడియాలో పోస్టు చేసిన  యువతుల ఫోటోలను వ్యభిచారులుగా చిత్రీకరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.


విజయవాడ: సోషల్ మీడియాలో పోస్టు చేసిన  యువతుల ఫోటోలను వ్యభిచారులుగా చిత్రీకరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన  యువతులు, మహిళల ఫోటోలను సేకరించి  వారిని వ్యభిచారులుగా పేర్కొంటూ  ప్రచారం చేస్తున్నారు.  అంతేకాదు ఆ ఫోటోల్లో ఉన్న యువతులు వ్యభిచారం నిర్వహిస్తారని ప్రచారం చేస్తున్నారు.

అంతేకాదు వారు వ్యభిచారం చేస్తే గంటకు ఎంత వసూలు చేస్తారనే విషయాన్ని కూడ ఓ వెబ్ సైట్ లో ప్రచారం చేస్తున్నారు. గుంటూరు పట్టణానికి చెందిన రాజేశ్వరీతో పాటు  ఆమె అల్లుడు  సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువతుల ఫోటోలను వ్యభిచారిణులుగా చిత్రీకరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ  ఈ రకంగా  డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా విజయవాడకు చెందిన ఓ యువతి ఫోటోను కూడ ఈ రకంగా వ్యభిచారిణిగా పోస్ట్ చేయడంతో  బాధితురాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు గుంటూరులోని రాజేశ్వరీ ఈ వ్యవహరంలో కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు.

బుధవారం నాడు ఉదయం రాజేశ్వరీతో పాటు  ఆమె అల్లుడిని కూడ అరెస్ట్ చేశారు. ఏడాదిన్నరగా వీరిద్దరూ 5 తప్పుడు బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.20 లక్షలను సంపాదించినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే సుమారు 40 మంది అమ్మాయిల ఫోటోలను సేకరించి  వ్యభిచారుణులుగా డబ్బులు వసూలు చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన వీరిద్దరితో పాటు  ఇంకా ఎవరెవరు  ఉన్నారనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే