ఇద్దరు పిల్లలున్నా బీటెక్ విద్యార్థినితో లవ్: పారిపోయి చివరికిలా..

Published : Aug 15, 2018, 12:06 PM ISTUpdated : Sep 09, 2018, 10:58 AM IST
ఇద్దరు పిల్లలున్నా బీటెక్ విద్యార్థినితో లవ్: పారిపోయి చివరికిలా..

సారాంశం

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్‌లో ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.  ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. 


తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్‌లో ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.  ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. 

కృష్ణా జిల్లా టైలర్‌పేటకు చెందిన  ఆటోడ్రైవర్  దారా ఫృద్వీరాజుకు  వివాహమై భార్య, ఇద్దరు పిల్లలున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన  బీటెక్ విద్యార్థిని కొత్తూరులంక సాయిదివ్వతో ఐదు మాసాల క్రితం పరిచయం ఏర్పడింది.

ఏలూరు నుండి ప్రతి రోజూ  సాయిదివ్వ విజయవాడకు గ్రూప్-2 కోచింగ్‌కు వస్తూండేది. దీంతో బస్టాండ్‌లో  ఫృద్వీరాజ్‌తో సాయిదివ్యతో పరిచయం ఏర్పడింది. ఈ నెల 9వ తేదీ నుండి సాయిదివ్వ కన్పించకుండా పోయింది.  దీంతో సాయిదివ్య అదృశ్యమైందిన కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సాయిదివ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  అయితే ఈ నెల 12వ తేదీన రాత్రి పది గంటల సమయంలో  ఆటో డ్రైవర్  ఫృద్వీరాజ్  సాయిదివ్యను గాంధీచౌక్‌లోని హోటల్ ప్రిన్స్  405లో దిగారు. ఉద్యోగం కోసమని చెప్పి వీరిద్దరూ ఈ హోటల్‌లో రూమ్ ను అద్దెకు దిగారు. 

అయితే రూమ్‌లో అద్దెకు దిగిన తర్వాత  కూడ  ఇంత వరకు కూడ వాళ్లు తలుపు తీయలేదు. సోమవారం నాడు  గది నుండి దుర్వాసన రావడంతో  హోటల్  సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.  

పోలీసులు తలుపులు పగులగొట్టి చూస్తే  వారిద్దరూ కూడ ఉరేసుకొని ఉన్నారు.  మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

హ్యాట్సాఫ్ బీద | Dr Masthan Basha great words about MP Beeda Masthan Rao | Asianet News Telugu
IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే