కన్నాకి కేశినేని నాని కౌంటర్ ఎటాక్

Published : Aug 15, 2018, 12:54 PM ISTUpdated : Sep 09, 2018, 12:24 PM IST
కన్నాకి కేశినేని నాని కౌంటర్ ఎటాక్

సారాంశం

 ఆయన వ్యాఖ్యలను ఆయనకే తిప్పి కొట్టారు ఎంపీ కేశినేని నాని.

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బుధవారం ఉదయం కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ మండిపడ్డారు. కాగా.. ఆయన వ్యాఖ్యలను ఆయనకే తిప్పి కొట్టారు ఎంపీ కేశినేని నాని.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్ర ద్రోహి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. నగరంలోని తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నా లక్ష్మీ నారాయణ భాజపాలో చేరి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి అని విమర్శించారు. 

పురందేశ్వరి, కన్నా ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా తయారయ్యారని మండిపడ్డారు. భాజపాను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అమరావతి బాండ్స్ గంటలో వేగంగా అమ్ముడు అయ్యాయంటే చంద్రబాబుకి ఉన్న ఇమేజ్ వల్లే అది సాధ్యమైందని నాని అన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?