రాజధాని రచ్చ: లోకేష్ సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్

Published : Jan 07, 2020, 02:05 PM ISTUpdated : Jan 07, 2020, 02:14 PM IST
రాజధాని రచ్చ: లోకేష్ సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్

సారాంశం

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతొంది. రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

విజయవాడ: విజయవాడలో దీక్షకు దిగిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహన్ రావు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ: గన్‌మెన్లపై పిడిగుద్దులు, రాళ్ల దాడి

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  24 గంటల పాటు దీక్షకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్తుండగా పోలీసులు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద  పోలీసులు అడ్డుకొన్నారు.

చినకాకాని వద్ద రైతుల దీక్షకు మద్దతుగా వెళ్లకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మంగళగిరిలో  హైవేపై ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్తానని లోకేష్ చెప్పినా కూడ పోలీసులు ఇంటి వద్ద దింపుతామని చెప్పి యనమలకుదూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read:రాజధాని రచ్చ: టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు, ఉద్రిక్తత

లోకేష్‌తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
CM Chandrababu Naidu Attends Swachha Andhra Swarna Andhra Program in Nagari | Asianet News Telugu