కన్న కూతురిని తల్లిచేసిన కామాంధుడు.. అల్లుడితో కాపురం చేయొద్దని బెదిరించి..

By telugu teamFirst Published Jan 7, 2020, 11:29 AM IST
Highlights

అప్పటికే అతని కన్ను తన కూతురిపై ఉంది. ఎలాగైనా అనుభవించాలనే పథకంతోనే వాళ్లని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఓకానొక రోజు సమయం చూసుకొని.. భార్య, అల్లుడు కూలి పనులకు వెళ్లగా.. కూతురు ఇంట్లోనే ఉండేలా పథకం వేశాడు.. 


పరాయి చూపు పడకుండా.... కంటి కి రెప్పలా కాపాడాల్సిన కూతురిపైనే ఓ వ్యక్తి కన్నేశాడు. మైనార్టీ తీరకుండానే కూతురికి పెళ్లి చేశాడు. కొద్ది రోజులకే.. కూతురు, అల్లుడిని తన ఇంటికి రప్పించుకున్నాడు. తన భార్య, అల్లుడు ఇంట్లో లేని సమయంలో... కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అల్లుడితో ఇక నుంచి కాపురం కూడా చేయవద్దంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కన్న తండ్రి కారణంగా ఆమె గర్భం దాల్చడం మరింత దారుణ విషయం. ఈ వేధింపులు, బాధలన్నీ భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నల్ల చెరువు 19వ లైన్ కి చెందిన మహంకాళి నాగరాజు అనే వ్యక్తి కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కాగా 2016 ఆగస్టు 8వ తేదీన నాగరాజు మైనార్టీ తీరకుండానే తన రెండో కుమార్తెకు వివాహం జరిపించాడు. కొంతకాలం తర్వాత, కూతురు, అల్లుడిని తన ఇంట్లోనే తెచ్చి పెట్టకున్నాడు.

అప్పటికే అతని కన్ను తన కూతురిపై ఉంది. ఎలాగైనా అనుభవించాలనే పథకంతోనే వాళ్లని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఓకానొక రోజు సమయం చూసుకొని.. భార్య, అల్లుడు కూలి పనులకు వెళ్లగా.. కూతురు ఇంట్లోనే ఉండేలా పథకం వేశాడు.. 

వాళ్లు లేని సమయంలో కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తూనే.. అల్లుడితో కూడా కాపురం చేయవద్దని బెదిరించాడు. ఈ క్రమంలో.. ఆమె గర్భం కూడా దాల్చింది. తండ్రి కారణంగా ఆమె తల్లి కాబోతుండటాన్ని.. భర్త వేధింపులను ఆమె తట్టుకోలేకపోయింది. 

AlsoRead వింధుకి ఇంటికి పిలిస్తే... మహిళా వీఆర్ఏతో ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అయితే.. మొదటి నుంచి నాగరాజు బుద్ధి తెలిసిన బంధువులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నాగరాజు ఇంటి నుంచి పరారయ్యాడు. నాగరాజు అఘాయిత్యం వల్లే ఆమె గర్భం దాల్చినట్లు డీఎన్ఏ పరీక్షలో తేలడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. 

ఇటీవల అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ నేరాల పునః సమీక్ష సమయంలో ఈ కేసుపై ఆరా తీసి నిందితుడిని పట్టుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నాగరాజుపై నిఘా పెట్టిన పోలీసులు అతడు ప్రస్తుతం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో ఉంటున్నాడని తెలిసి సోమవారం అరెస్టు చేశారు.

click me!