పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ: గన్‌మెన్లపై పిడిగుద్దులు, రాళ్ల దాడి

By narsimha lode  |  First Published Jan 7, 2020, 12:56 PM IST

అమరావతి సెగ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృస్ణారెడ్డికి తగిలింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. 



గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తగిలింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై మంగళవారం నాడు రాళ్లు రువ్వారు.

Also read:రాజధాని రచ్చ: టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు, ఉద్రిక్తత

Latest Videos

undefined

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిరక్షణ సమితి జేఎసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు  జాతీయ రహదారుల దిగ్భంధనానికి పిలుపునిచ్చారు..

also readజగన్ దూకుడు: బాబుకు ఇలా చెక్, వ్యూహమిదీ...

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిరక్షణ సమితి జేఎసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు  జాతీయ రహదారుల దిగ్భంధనానికి పిలుపునిచ్చారు..

also readజగన్‌కు షాక్: అమరావతి రైతుల ఆందోళన, వాస్తవాలు ఇవీ..

గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద జేఎసీ నేతలు రహదారి దిగ్భందం చేస్తున్నారు. ఆ సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు రాస్తారోకోలో చిక్కుకుపోయింది. దీంతో నిరసనకారులు  చీప్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును చుట్టుముట్టారు.

కారు వద్ద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి రక్షణగా గన్‌మెన్లు నిలుచున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వచ్చి గన్‌మెన్లపై దాడికి దిగారు. కారును ముందుకు వెళ్లకుండా నిరసనకారులు అడ్డుకొన్నారు. కారుపై నిరసనకారులు దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు మరో కారును అడ్డుగా నిలిపారు.  కారుపై రాళ్లతో దాడికి దిగారు.

వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అంటూ కారు చుట్టూ ఆందోళనకారులు అడ్డుకొన్నారు. కారు ముందు కొందరు బైఠాయించారు. కారును ముందుకు పోకుండా అడ్డుకొన్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుకు అడ్డు పెట్టారు. పిన్నెల్లి కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నారు.

పోలీసులు కారును బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆందోళనకారుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. అయితే ఈ సమయంలో కారుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ సమయంలో కారు అద్దాలను మూసివేశారు. మరో వైపు కారుపై రాళ్లతో దాడికి దిగారు.

ఈ రాళ్ల దాడితో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఎదురుగా ఉన్న కారును అతి చాకచక్యంగా తప్పించుకొంటూ స్పీడుగా ముందుకు పోనిచ్చాడు. ఈ సమయంలో ఎమ్మెల్యే కారును వెంటాడి రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
 

click me!