ఆస్పత్రి నుండి కరోనా రోగి మిస్సింగ్... చివరకు అదే హాస్పిటల్ లో శవమై

By Arun Kumar PFirst Published Jul 3, 2020, 7:41 PM IST
Highlights

విజయవాడ కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు పది రోజుల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 

విజయవాడ కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు పది రోజుల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వృద్దుడు అదే ఆస్పత్రిలో కరోనాతో మృతిచెందినట్లు... అతడి మృతదేహం మార్చురీలో వున్నట్లు పోలీసులు గుర్తించారు. 

వివరాల్లోకి వెడితే... విజయవాడలో నివాసం ఉండే వసంతరావుకు బాగా ఆయాసం రావడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రి కి పంపారు. ఈనెల 24వ తేదీన ఆస్పత్రికి వెళ్లగా చాలా సేపటికి స్పందించిన సిబ్బంది.. ఆయన్ని వీల్ చైర్  మీద లోపలకు పంపారు. పల్స్ పడిపోతున్నాయని...  ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు. 

అతడి భార్య ధనలక్ష్మిని లోనికి రావద్దని చెప్పి ఇంటికి పంపించివేశారు. తెల్లారి వెడితే ఆ పేరు గలవారు ఆస్పత్రిలో ఎవరూ లేరని చెప్పారు. దీంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చి  ఆస్పత్రి ముందు ప్లకార్డు పట్టుకుని కూర్చుని నిరసనకు దిగింది. 

read more   ఏపిలో కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి భర్త అదృశ్యం.. రోడ్డెక్కిన భార్య (చూడండి)

దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఆస్పత్రిలో చేరిన రోజే వృద్దుడు మృతిచెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని సిబ్బంది మార్చూరుకి తరలించారు. కానీ ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యంతో వృద్ధుడు వివరాలు రికార్డుల్లో నమోదుచేయలేదు. దింతో వసంతారావు మిస్సింగ్ మిస్టరీగా మారింది. 

చివరకు పోలీసుల రంగప్రవేశంతో వృద్ధుడు ఆచూకీ లభించింది. గత 10 రోజులుగా కుటుంబ సభ్యులు వివరణ కోరినా ఆసుపత్రి వర్గాలు సరైన వివరణ ఇవ్వలేదు. ఇలా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో గత 10 రోజులుగా కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. డాక్టర్లు తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చురీలో ఉన్న మృతదేహం వసంతరావుదిగా కుటుంబసభ్యులు గుర్తించారు. 

click me!