చంద్రబాబు మోసగాడు, టీడీపీని ఖాళీ చేస్తా:కేశినేని నాని సీరియస్ కామెంట్స్

By narsimha lode  |  First Published Jan 10, 2024, 6:19 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై  విజయవాడ ఎంపీ కేశినేని నాని  తీవ్ర విమర్శలు చేశారు. 


విజయవాడ:చంద్రబాబు మోసగాడని  ప్రపంచానికి తెలుసునని  విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు.  చంద్రబాబు రాష్ట్రానికి పనికిరాడని  కేశినేని నాని తెలిపారు.బుధవారంనాడు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో  కేశినేని నాని  భేటీ అయ్యారు.  ఈ భేటీ ముగిసిన  తర్వాత  కేశినేని నాని  మీడియాతో మాట్లాడారు. 

తెలుగు దేశం పార్టీ కోసం  తన స్వంత వ్యాపారాలను  కూడ వదులుకున్నట్టుగా  చెప్పారు.తాను  అమ్ముకున్న  ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని కేశినేని నాని చెప్పారు.  తన స్వంత వ్యాపారం కంటే పార్టీ ముఖ్యమని తాను భావించినట్టుగా  కేశినేని నాని చెప్పారు.  

Latest Videos

undefined

also read:తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఊరట: మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

2013 జనవరి  16వ తేదీ నుండి  విజయవాడ పార్లమెంట్ ఇంచార్జీగా  తెలుగు దేశం పార్టీ కోసం  పనిచేసినట్టుగా  ఆయన చెప్పారు.తనను టీడీపీలో  చేరడాన్ని తన సన్నిహితులు కొందరు  వ్యతిరేకించారన్నారు.  కానీ, తెలుగు దేశం పార్టీ  అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో తాను టీడీపీలో కొనసాగినట్టుగా  చెప్పారు.

2013లో చంద్రబాబు పాదయాత్ర నుండి స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో  పార్టీ విజయం సాధించిందన్నారు. 2013 నుండి  2014 వరకు  పార్టీ కోసం తన జేబులో రూపాయే ఖర్చు పెట్టినట్టుగా కేశినేని నాని చెప్పారు.  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  పేదల పక్షపాతి అని ఆయన  చెప్పారు.  ఇంత పచ్చి మోసగాడని ఇప్పుడే తనకు తెలిసిందని  కేశినేని నాని విమర్శించారు. వై.ఎస్. జగన్ తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా  చెప్పారు.విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరుతానని కేశినేని నాని  ప్రకటించారు.  విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో  60 శాతం  టీడీపీని  ఖాళీ చేయిస్తానని  చెప్పారు. ఎన్‌టీఆర్ జిల్లాలో  టీడీపీ  ఖాళీ  చేయిస్తానని కేశినేని నాని చెప్పారు.

also read:మెత్తబడని మాజీ మంత్రి: తెలుగుదేశంలోకి మాజీ మంత్రి పార్థసారథి?

2014-2019  వరకు  విజయవాడ కోసం  చంద్రబాబు రూ. 100 కోట్లైనా ఖర్చు పెట్టాడా అని ఆయన  ప్రశ్నించారు. విజయవాడలో చేసిన అభివృద్ది అంతా తాను తెచ్చిన నిధుల వల్లేనని  కేశినేని నాని చెప్పారు.

also read:వైఎస్ఆర్‌సీపీకి గుడ్‌బై: రాజీనామా చేసిన కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్

తన కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశారని ఆయన ప్రశ్నించారు.  తనను గొట్టంగాడు తిట్టించారన్నారు.  అంతేకాదు  తనను చెప్పుతో కొడతానని కూడ  పార్టీలోని నేతలే విమర్శలు చేస్తే  భరించినట్టుగా  కేశినేని నాని చెప్పారు. పార్టీలో అనేక అవమానాలు భరించి కూడ పార్టీలోనే కొనసాగినట్టుగా  కేశినేని నాని చెప్పారు.  విజయవాడ ఒక రియాలిటీ, అమరావతి ఓ కల అని కేశినేని నాని చెప్పారు.  విజయవాడ ఎంపీగా  ముఖ్యమంత్రి  కార్యక్రమాలకు హాజరు కావాలి.  కానీ, తనను హాజరు కావొద్దని పార్టీ ఆదేశించినందున తాను   విజయవాడలో సీఎం కార్యక్రమాలకు హాజరు కాలేదని  నాని చెప్పారు. 
 

click me!