యూపీలో విజయవాడకు చెందిన యువతి ఫాతిమా హత్యకు గురైంది. ప్రేమపేరుతో ఆమెను తీసుకెళ్లిన ఇధ్దరు యువకులు హత్య చేశారని స్థానిక పోలీసులు గుర్తించారు. నిందితులను విజయవాడకు తీసుకెళ్లాలని స్థానిక పోలీసులు కోరుతున్నారు. ఎక్కడ ఘటన జరిగిందో ఆ రాష్ట్ర పోలీసులే కేసును దర్యాప్తు చేస్తారని విజయవాడ పోలీసులు చెబుతున్నారు.
విజయవాడ: ప్రేమ పేరుతో విజయవాడకు చెందిన యువతిని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లి హత్య చేసిన ఘటనపై దర్యాప్తు ముందుకు సాగడం లేదు.విజయవాడలోని చిట్టినగర్ కు చెందిన యువతి ఫాతిమాను ప్రేమ పేరుతో ఇధ్దరు యువకులు యూపీలోని సహరంపూరకు తీసుకెళ్లారు.ఈ నెల 10వ తేదీ నుండి యువతి కన్పించడం లేదిన ఫాతిమా తండ్రి అహ్మద్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తే సహరంపూరకు వెళ్లినట్టుగా గుర్తించారు. ఈ మేరకు రైలు టిక్కెట్లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఫాతిమాను హత్య చేసి ఆమె వద్ద ఉన్న 15 తులాల బంగారాన్ని పంచుకొన్నామని యూపీ పోలీసులకు నిందితులు వెల్లడించారని సమాచారం.
undefined
అయితే ఫాతిమా డెడ్ బాడీ ఇంతవరకు దొరకలేదు.ఈ విషయం తెలిసిన తర్వాత ఫాతిమా తండ్రి అహ్మద్ అతని స్నేహితులు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును విజయవాడ పోలీసులు విచారణ నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని స్థానిక పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. నిందితులను ఎక్కువ కాలం పోలీస్ స్టేషన్ లో ఉంచలేమని యూపీ పోలీసులు చెబుతున్నారు.
నిందితులను విజయవాడకు పంపించేందుకు అవసరమైన రక్షణను కూడ కల్పిస్తామని యూపీ పోలీసులు చెబుతున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కానీ ఎక్కడ ఘటన జరిగిందో అక్కడే కేసు విచారణ చేయాలని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. యూపీ పోలీసులకు అవసరమైన సహకారం అందిస్తామని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసుల తీరుతో బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది.