శిథిలాల తొలగింపు కొనసాగుతోంది: దుర్గగుడి ఈవో

By Siva KodatiFirst Published Oct 21, 2020, 6:52 PM IST
Highlights

దుర్గగుడి నిధులకు సీఎం జగన్ అంగీకరించారని తెలిపారు విజయవాడ కనక దుర్గ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేశ్. ఇంద్రకీలాద్రిపై బుధవారం కొండచరియలు విరిగి పడిన ఘటనపై ఆయన స్పందించారు.

దుర్గగుడి నిధులకు సీఎం జగన్ అంగీకరించారని తెలిపారు విజయవాడ కనక దుర్గ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేశ్. ఇంద్రకీలాద్రిపై బుధవారం కొండచరియలు విరిగి పడిన ఘటనపై ఆయన స్పందించారు.

శిథిలాల కింద ఎవరూ లేరని భావిస్తున్నామని... శిథిలాల తొలగింపు తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని సురేశ్ చెప్పారు. కాగా, ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న చిన్న రాళ్లు కిందపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డుల్ని కూడా ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో ఆ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడే అవకాశం వుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అయితే బుధవారమే కొండ చరియలు విరిగిపడ్డాయి.

Also Read:ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు: రాళ్ల కింద పోలీసులు, ఇతర సిబ్బంది..?

అంతకుముందు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు.

click me!