ఆరున్నర వేలు దాటిన కరోనా మృతులు: ఏపీలో 7,93,299 కి చేరిన కేసులు

By narsimha lodeFirst Published Oct 21, 2020, 6:20 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3746 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 93 వేల 299కి చేరుకొన్నాయి. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3746 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 93 వేల 299కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో  27 మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణాలో ఐదుగురు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురి చొప్పున చనిపోయారు.కడప, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతోరాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,508కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 72 లక్షల 71 వేల 050 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 74,42మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3746మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల54 వేల 415 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 32,376 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 301,చిత్తూరులో 437 తూర్పుగోదావరిలో 677, గుంటూరులో 3396, కడపలో 166 కృష్ణాలో 503, కర్నూల్ లో 65 నెల్లూరులో 116,ప్రకాశంలో 3127, శ్రీకాకుళంలో 167, విశాఖపట్టణంలో 138, విజయనగరంలో 134,పశ్చిమగోదావరిలో 519కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -63,111, మరణాలు 542
చిత్తూరు  -74,931మరణాలు 752
తూర్పుగోదావరి -1,11,694 మరణాలు 593
గుంటూరు  -63,694 మరణాలు 594
కడప  -50,374 మరణాలు 420
కృష్ణా  -35,616 మరణాలు 537
కర్నూల్  -58,961 మరణాలు 480
నెల్లూరు -58,542 మరణాలు 483
ప్రకాశం -57,325 మరణాలు 563
శ్రీకాకుళం -43,010 మరణాలు 338
విశాఖపట్టణం  -54,304 మరణాలు 495
విజయనగరం  -38,451 మరణాలు 226
పశ్చిమగోదావరి -80,621 మరణాలు 485
 

 

: 21/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,90,404 పాజిటివ్ కేసు లకు గాను
*7,51,520 మంది డిశ్చార్జ్ కాగా
*6,508 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 32,376 pic.twitter.com/gCpFDV9zIq

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!