విజయవాడ గ్యాంగ్‌వార్‌: పండు తల్లిపై కూడ కేసు

Published : Jun 11, 2020, 03:47 PM IST
విజయవాడ గ్యాంగ్‌వార్‌: పండు తల్లిపై కూడ కేసు

సారాంశం

విజయవాడ గ్యాంగ్ వార్‌ కేసును పూర్తి స్థాయిలో చేధించేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. వీధి యుద్ధాలకు దిగితే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.పండు తల్లిపై కూడ కేసు నమోదు చేసినట్టుగా ఆయన తెలిపారు.   

విజయవాడ: విజయవాడ గ్యాంగ్ వార్‌ కేసును పూర్తి స్థాయిలో చేధించేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. వీధి యుద్ధాలకు దిగితే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.పండు తల్లిపై కూడ కేసు నమోదు చేసినట్టుగా ఆయన తెలిపారు. 

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ గ్యాంగ్ వార్ లో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటు వేస్తామన్నారు. పండు గ్యాంగుల్లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.

సందీప్ టీమ్ లో 15 మందిని రిమాండ్‌కు పంపామన్నారు. రెండు గ్యాంగుల్లోని సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశామన్నారు. మరో 15 మంది నిందితులు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. వీరి కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పండు డిశ్చార్జ్ కాగానే అతడిని కూడ అదుపులోకి తీసుకొంటామన్నారు. కొడుకులో నేర ప్రవృత్తిని ప్రోత్సహించిన తల్లి పద్మావతిపై కూడ కేసు నమోదు చేశామన్నారు.

గ్యాంగ్ వార్ కు ముందు పండు, సందీప్ ల మధ్య కాల్ డేటాను కూడ పోలీసులు పరిశీలించారు. పండు నుండి సందీప్ కు ఆరు దఫాలు, పండుకు సందీప్ నుండి నాలుగు దఫాలు ఫోన్ కాల్స్ వెళ్లినట్టుగా ఆయన తెలిపారు. 

also read:విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

ఈ ఇద్దరి మధ్య గొడవకు కారణమైన భూ యజమానులు శ్రీధర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలపై కూడ కేసు నమోదు చేశారు. ఈ భూ వివాదం సెటిల్ చేయడానికి సందీప్, పండులను రంగంలోకి దించిన నాగబాబును కూడ విచారిస్తున్నట్టుగా  ఆయన తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్