బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాకు భారీ వర్ష సూచన

By Siva KodatiFirst Published Jun 11, 2020, 2:53 PM IST
Highlights

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

రానున్న 48గంటల్లో అది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఇప్పటికే కోస్తాలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి.

Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

రానున్న 24 గంటల్లో విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ..మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

రుతు రుతుపవనాలు రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుండటంతో వర్షాలు మొదలయ్యాయి. మంగళవారం కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.

విశాఖపట్నం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచాయి. సమయానికి వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:8కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

వీటి ప్రభావంతోనే... తెలంగాణ వ్యాప్తంగా ముందస్తు వర్షాలు కురుస్తున్నాయని, వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్‌ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. ఈదురుగాలుల తీవ్రతకు రోడ్లపై చెట్లు విరిగిపడటంతో పలు చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 

click me!