దుర్గగుడి రథానికి అమర్చిన సింహాల విగ్రహాలు: నేడు రథం ఊరేగింపు

By narsimha lode  |  First Published Apr 13, 2021, 3:22 PM IST

 విజయవాడ దుర్గగుడిలో గత ఏడాది చోరీకి గురైన మూడు వెండి సింహాల విగ్రహలను అధికారులు యథాస్థానంలో ఉంచారు.
 


విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో గత ఏడాది చోరీకి గురైన మూడు వెండి సింహాల విగ్రహలను అధికారులు యథాస్థానంలో ఉంచారు.విజయవాడ దుర్గగుడి ఆలయంలో వెండి సింహాల ప్రతిమలు 2020 అక్టోబర్ 21న  చోరీకి గురయ్యాయి. అయితే ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా అధికారులు గుర్తించారు.

ఈ  వెండి సింహాలను చోరీ చేసిన నిందితులను పోలీసులు ఈ ఏడాది జనవరి 23వ తేదీన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకొన్న మూడు సింహాల విగ్రహలను పోలీసులు స్వాధీనం చేసుకొని దుర్గగుడి అధికారులకు అప్పగించారు.వెండి రథానికి మూడు సింహాల విగ్రహాలను అధికారులు ఇవాళ యథాస్థానంలో అమర్చారు. ఇవాళ సాయంత్రం విజయవాడ పాతబస్తీలో  వెండి రథం ఊరేగింపు సాగనుంది. కోవిడ్ నిబంధనల మేరకు రథాన్ని ఊరేగించనున్నారు.

Latest Videos

విజయవాడ దుర్గగుడి  వెండి రథంపై సింహాల విగ్రహాలు చోరీకి గురైన ఘటనపై విపక్షాలు రాష్ట్రప ్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడ చోటు చేసుకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై సిట్ ను ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు నిందితులు దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. 
 

click me!