జగన్ విజ్ఞప్తి.. స్పందించిన మోడీ: గన్నవరానికి చేరుకున్న 2 లక్షల టీకాలు

By Siva KodatiFirst Published Apr 13, 2021, 3:08 PM IST
Highlights

గన్నవరంలోని టీకా కేంద్రానికి కోవిడ్ వ్యాక్యిన్లు చేరుకున్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా 2 లక్షలు డోసులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. వ్యాక్సిన్లను ప్రత్యేక వాహనాల్లో భారీ భద్రత మధ్య ఆయా జిల్లాలకు తరలించారు

గన్నవరంలోని టీకా కేంద్రానికి కోవిడ్ వ్యాక్యిన్లు చేరుకున్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా 2 లక్షలు డోసులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. వ్యాక్సిన్లను ప్రత్యేక వాహనాల్లో భారీ భద్రత మధ్య ఆయా జిల్లాలకు తరలించారు.

కృష్ణా జిల్లాకు 35 వేలు, విశాఖ 15 వేలు, తూర్పుగోదావరి జిల్లాకు 36 వేల వ్యాక్సిన్లు, ప.గో 30 వేలు, గుంటూరు 34 వేలు, నెల్లూరు జిల్లా 9,500, చిత్తూరు 15,500, ప్రకాశం 25 వేలు వ్యాక్సిన్లను కేటాయించారు. 

Also Read:ఏపీలో కరోనా డేంజర్ బెల్స్: మొత్తం 9,28,664కి చేరిక

టీకా మహోత్సవ్ కార్యక్రమానికి తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, వ్యాక్సిన్ అందుబాటులో లేని కారణంగా టీకా మహోత్సవ్ కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 25 లక్షల డోసులు కావాలని రెండు రోజుల క్రితం ప్రధానికి మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.

 అత్యవసరంగా 25 లక్షల డోసులు పంపాలని లేదంటే టీకా మహోత్సవ్ కు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండున్నర లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు

click me!