మరోసారి విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా: రేపటి నుండే రాకపోకలు

By narsimha lodeFirst Published Sep 17, 2020, 3:42 PM IST
Highlights

విజయవాడ పట్టణంలోని దుర్గగుడి ఫ్లై ఓవర్ పై ఈ నెల 18వ  తేదీ నుండి వాహనాల రాకపోకలను అనుమతించనున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి గడ్కరీని ఆహ్వానించారు.


విజయవాడ: విజయవాడ పట్టణంలోని దుర్గగుడి ఫ్లై ఓవర్ పై ఈ నెల 18వ  తేదీ నుండి వాహనాల రాకపోకలను అనుమతించనున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి గడ్కరీని ఆహ్వానించారు. మంత్రికి కరోనా సోకడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం చేయకుండానే ఫ్లైఓవర్ పై రాకపోకలను అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 4వ తేదీన దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం నిర్వహించాల్సి ఉంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఫ్లైఓవర్  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 

also read:ప్రణబ్ ముఖర్జీ మృతి: విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

అయితే ఈ నెల 18వ  తేదీన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా వచ్చింది. దీంతో ఆయన చికిత్స తీసుకొంటున్నారు.  దీంతో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరోసారి వాయిదా పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ నుండి అనుమతిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్ కార్యక్రమ ప్రారంభోత్సవం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడడంతో ప్రయాణీకులు ఇబ్మందులు పడుతున్నారు. దీంతో వాహనాల రాకపోకలను ప్రారంభిస్తామని ఎంపీ ప్రకటించారు. 
 

click me!