సబ్ కాంట్రాక్టర్ కీలక వాంగ్మూలం: లాక్‌డౌన్‌లో వెండి సింహాల చోరీ, పోలీసుల నిర్థారణ..?

By Siva KodatiFirst Published Sep 22, 2020, 7:53 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో సబ్ కాంట్రాక్టర్ వెంకట్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఈ ఏడాది ఉగాదికి రథం సిద్ధం చేసేందుకు వచ్చినప్పుడు సింహాల ప్రతిమలు ఉన్నాయని పోలీసులకు వెంకట్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో సబ్ కాంట్రాక్టర్ వెంకట్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఈ ఏడాది ఉగాదికి రథం సిద్ధం చేసేందుకు వచ్చినప్పుడు సింహాల ప్రతిమలు ఉన్నాయని పోలీసులకు వెంకట్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

దీంతో లాక్‌డౌన్‌ సమయంలోనే ప్రతిమలు చోరీకి గురయ్యాయని పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే సెక్యూరిటీ, క్లీనింగ్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ఇంటి దొంగల పనా.. బయట వ్యక్తుల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే శివాలయం దగ్గర పనులు చేసిన కార్మికులను ప్రశ్నించారు. పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ నుంచి వచ్చిన వర్కర్లు, నలుగురు మేస్త్రీల నుంచి వివరాలు సేకరించారు. వీరంతా లాక్‌డౌన్‌కు ముందు ఆ తర్వాత 21 రోజుల పాటు పనులు చేశారు. 

Also Read:వెండి సింహాల మాయం కేసు... ఆ నలుగురిని విచారిస్తున్న పోలీసులు

ఇప్పటివరకు ఈ చోరీ విషయంలో పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. రథంపై ఉన్న సింహాల ప్రతిమలను దొంగలు స్క్రూలు విప్పి తీసుకెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నాలుగో రథం స్క్రూల్ రాకపోకవడంతో ఆ విగ్రహాన్ని పెకిలించే ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగో విగ్రహాన్ని రథం నుండి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతోనే నిందితులు విగ్రహాన్ని వదిలి  వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

click me!