ఆయేషా మీరా హత్య కేసు: నార్కో పరీక్షలకు కోర్ట్ అనుమతి కోరిన సీబీఐ.. విచారణ వాయిదా

Siva Kodati |  
Published : Sep 07, 2021, 07:45 PM ISTUpdated : Sep 08, 2021, 07:50 AM IST
ఆయేషా మీరా హత్య కేసు: నార్కో పరీక్షలకు కోర్ట్ అనుమతి కోరిన సీబీఐ.. విచారణ వాయిదా

సారాంశం

విజయవాడ బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసులో అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్షల పిటిషన్‌పై వాదనలను కోర్ట్ ఎల్లుండికి వాయిదా వేసింది. అనుమానితులకు నార్కో పరీక్షలు చేసేందుకు సీబీఐ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నార్కో అనాలసిస్ పరీక్షల పిటిషన్‌పై వాదనలను కోర్ట్ ఎల్లుండికి వాయిదా వేసింది. అనుమానితులకు నార్కో పరీక్షలు చేసేందుకు సీబీఐ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం  .. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. 

అయేషా మీరా హత్య జరిగి సుమారు 12 ఏళ్లు అవుతోంది. ఉమ్మడి ఏపీలో 2007 డిసెంబర్ 27వ తేదీన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో అయేషా మీరా దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సత్యంబాబును దోషిగా గుర్తించి పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో సత్యం బాబు దోషి కాదని హైకోర్టు తేల్చడంతో అతను  జైలు నుండి విడుదలయ్యారు. 

సత్యంబాబు కూడా జైలు నుండి విడుదల కావడంతో అసలు దోషులు ఎవరనే విషయమై తేల్చేందుకు ఈ కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు. సీబీఐ అధికారులు ఈ కేసును మొదటి నుండి విచారణ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయేషా మీరా మృతదేహానికి 2020 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం నిర్వహించారు

PREV
click me!

Recommended Stories

నగరి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో CM Chandrababu Power Full Speech | Asianet News Telugu
అమెరికాఅనుభవాలతో సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని ఆశిస్తున్నా: Chandrababu | Asianet News Telugu