నరేగా బిల్లులు చెల్లిస్తారా లేదా.. ఏపీ సర్కార్‌పై హైకోర్ట్ ఆగ్రహం, 15 వరకు డెడ్‌లైన్

Siva Kodati |  
Published : Sep 07, 2021, 05:42 PM IST
నరేగా బిల్లులు చెల్లిస్తారా లేదా.. ఏపీ సర్కార్‌పై హైకోర్ట్ ఆగ్రహం, 15 వరకు డెడ్‌లైన్

సారాంశం

ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులపై మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 15లోగా బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటివరకు ఎవరికెంత చెల్లించారనే వివరాలు ఈ నెల 15లోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.    

ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులపై మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 15లోగా బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల క్రితం 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. కేవలం 25 కేసుల్లోనే చెల్లింపులు చేయడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

గ్రామ సర్పంచ్‌ ఖాతాల్లో వేస్తే కాంట్రాక్టర్‌కు చెల్లించట్లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. వారి వివరాలు ఇస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో ఇప్పటికే విచారణ జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎవరికెంత చెల్లించారనే వివరాలు ఈ నెల 15లోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి