శ్రీవారి భక్తులకు శుభవార్త... రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల పంపిణీ, కానీ వీరికి మాత్రమే

Siva Kodati |  
Published : Sep 07, 2021, 06:26 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త... రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల పంపిణీ, కానీ వీరికి మాత్రమే

సారాంశం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. అలిపిరి దగ్గర రోజుకు 2 వేలు చొప్పున  టోకెన్లు జారీ చేయనున్నారు అధికారులు. అయితే చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ఈ టోకెన్లు పరిమితం చేయబోతోంది టీటీడీ. 

రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. అలిపిరి దగ్గర రోజుకు 2 వేలు చొప్పున  టోకెన్లు జారీ చేయనున్నారు అధికారులు. అయితే చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ఈ టోకెన్లు పరిమితం చేయబోతోంది టీటీడీ. కరోనా కారణంగా 6 నెలలుగా సర్వదర్శనం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై కోవిడ్ ప్రభావం పడింది. ఈ ఏడాది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించబోతోంది. స్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu