విజయవాడలో హవాలా ముఠా అరెస్ట్: రూ. 1.49 కోట్లు సీజ్

By narsimha lodeFirst Published Sep 8, 2020, 1:44 PM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుండి  హైద్రాబాద్ కు  హవాలా సొమ్ము తరలిస్తున్న ముఠాను  విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.


విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుండి  హైద్రాబాద్ కు  హవాలా సొమ్ము తరలిస్తున్న ముఠాను  విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

హవాలా ముఠా హైద్రాబాద్ కు కారులో వెళ్తుందని  సమాచారం తెలుసుకొన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం నుండి స్విఫ్ట్ కారులో హైద్రాబాద్  కు  రూ. 1.49 కోట్ల ఇండియన్ కరెన్సీ, రూ. 24 లక్షలు విలువ చేసే యూఎస్ డాలర్లను పోలీసులు సీజ్ చేశారు.

బంగారం వ్యాపారి ప్రవీణ్ జైన్ తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఎంత కాలం నుండి హవాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ హవాలా  ముఠా కార్యక్రమాలు చేస్తోందా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.గత ఏడాది మే మాసంలో కూడ విజయవాడ పోలీసులు హావాలా రాకెట్ ను పట్టుకొన్నారు. నిందితుల నుండి 1.77 కిలోల బంగారం,40 కిలోల వెండిని స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు నిందితుల నుండి రూ. 88 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. 

click me!