స్వర్ణ ప్యాలెస్ పై నోరు మెదపలేదు, అంతర్వేదిపై స్పందించారు: బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

Published : Sep 08, 2020, 01:17 PM IST
స్వర్ణ ప్యాలెస్ పై నోరు మెదపలేదు, అంతర్వేదిపై స్పందించారు: బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

సారాంశం

అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతికావడంపై  స్పందించిన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు... స్వర్ణ ప్యాలెస్  అగ్ని ప్రమాదంలో 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని  ఎంపీ విజయసాయి రెడ్డి  ప్రశ్నించారు.

అమరావతి: అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతికావడంపై  స్పందించిన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు... స్వర్ణ ప్యాలెస్  అగ్ని ప్రమాదంలో 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని  ఎంపీ విజయసాయి రెడ్డి  ప్రశ్నించారు.

 

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధమైన  గంటల వ్యవధిలోనే నిజ నిర్ధారణ కమిటీ వేసిన విషయాన్ని విజయ సాయిరెడ్డి గుర్తు చేశారు. స్వర్ణ ప్యాలెస్ లో 10 మంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు కనీసం నోరు కూడ  మెదపలేదన్నారు. రమేష్ ఆసుపత్రిపై ఈగ కూడ వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

 

మరో వైపు సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు. జయప్రకాష్ రెడ్డి మరణం  తెలుగు సినీ పరిశ్రమకు, రంగస్థలానికి  తీరని లోటన్నారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  విజయసాయి రెడ్డి కోరారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!