ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సోమవారంనాడు విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని సూర్యనారాయణపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం సూర్యనారాయణ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
undefined
పన్ను ఎగవేతకు సంబంధించి వ్యాపారులతో కలిపి కుట్ర పన్నారని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నేతగా ఉన్న కేఆర్ సూర్యనారాయణ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కేఆర్ సూర్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు గతంలోనే నిరాకరించింది.
ఇదే కేసులో విజయవాడ ఏడీజే కోర్టులో ముందస్తు బెయిల్ కోసం సూర్యనారాయణ గత మాసంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.