అసెంబ్లీ సభా హక్కుల కమిటీ, 9 జాయింట్ కమిటీల నియామకం.. భూమనకు కీలక పదవి..

Published : Jul 17, 2023, 05:22 PM ISTUpdated : Jul 17, 2023, 05:24 PM IST
అసెంబ్లీ సభా హక్కుల కమిటీ, 9 జాయింట్ కమిటీల నియామకం..  భూమనకు కీలక పదవి..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టారు. భూమన  కరుణాకర్ రెడ్డిని అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టారు. భూమన  కరుణాకర్ రెడ్డిని అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి, సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. అసెంబ్లీ జాయింట్ కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. 9 జాయింట్ కమిటీలు నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 

>> అమెనిటీస్ కమిటీ చైర్మన్‌గా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, 
>> వైల్డ్‌లైఫ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా శాసనసభ స్పీకర్ స్పీకర్ తమ్మినేని తమ్మినేని, 
>> ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గొల్ల బాబురావు, 
>> ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తెల్లం బాలరాజు, 
>> మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా మహ్మద్ ముస్తఫా, 
>> స్త్రీ, శిశు, వృద్దులు, డిసేబుల్డ్ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జొన్నలగడ్డ పద్మావతి, 
>> సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ  చైర్మన్‌గా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
>> వెనకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రమేష్ యాదవ్ రాజగొల్ల, 
>> లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా రామసుబ్బారెడ్డి
 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu