గాలి బుడగలా ఎగురుతున్నావే చెల్లెమ్మా!.. పురంధేశ్వరిపై విజయసాయి సెటైర్...

By SumaBala Bukka  |  First Published Nov 1, 2023, 11:31 AM IST

సొంతపార్టీని కాదని.. సామాజిక వర్గానికి చెందిన కుటుంబ పార్టీ బలోపేతానికి తపిస్తోందని.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు.  


విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు  మధ్యంతర బెయిలుపై విడుదల అవ్వడం మీద బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్వాగతించారు.  దీనిమీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు  పురందేశ్వరి మీద  ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి.  ‘సంస్థాగతంగా బిజెపిని ఇప్పుడు మీరున్న పార్టీని ఫణంగా పెట్టి మీ సామాజిక వర్గ కుటుంబం పార్టీ అయిన టిడిపి బలోపేతం కోసం తపిస్తున్నామని ఢిల్లీ పెద్దలకు తెలుసులేమ్మా పురందేశ్వరి’  అంటూ వ్యంగ్య బాణాలు విసిరారు.

తిరిగి చెల్లెమ్మా అంటూ సంబోధిస్తూ.. ‘గతంలో ఇసుకను దోచుకునేవారు.  ఇప్పుడు సహజ వనరుల దోపిడీ తగ్గింది.  ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోంది.  ఈ విషయం తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!’ అంటూ పోస్ట్ చేశారు.

Latest Videos

మళ్లీ డిల్లీకి పయనమైన నారా లోకేష్ ... తండ్రి విడుదలైనా న్యాయంకోసం పోరాటమే..

 కాగా,  మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర వేలును మంజూరు చేసిన నేపథ్యంలో  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దానిని స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా అరెస్టు చేసిన విధానాన్ని తప్పు పట్టారు.ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని పురందేశ్వరి అన్నారు. 

 

click me!