తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్... విజయసాయి రెడ్డి

Published : Nov 03, 2018, 11:52 AM IST
తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్... విజయసాయి రెడ్డి

సారాంశం

ప్రజలెటుపోయినా పర్వాలేదు కానీ తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. ట్విట్టర్ వేధికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
‘‘ తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు.. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనుడు. ప్రత్యేక హోదా కాదని స్పెషల్ ప్యాకేజీ అడిగి.. వచ్చిన నిధులను తన సొంత ఖాజానాలోకి మళ్లించుకున్నాడు. ప్రజలెటుపోయినా పర్వాలేదు కానీ తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

మరో ట్వీట్ లో చంద్రబాబు పై విమర్శలు కురిపిపిస్తూ.. ప్రత్యేకంగా ఓ వీడియోని కూడా పోస్టు చేశారు. ‘‘ గత నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఏపీ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం చేసి భారతదేశంలోనే ఇంతవరకు ఎవరూ పాల్పడనంత అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతి కారణంగా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి.. ఆస్తులు కూడపెట్టుకున్నారు.ఆయన పేరుతో, ఆయన బినామీల పేరిట ఆస్తులు దాచుకున్నారు.’’

 

‘‘ఐటీ దాడులతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయని చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన బినామీలపై జరుగుతున్న సోదాలను అడ్డుకోవడానికి ఆయన ప్రజామద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఐటీదాడులపై ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయన పెట్టుబడుల మంత్రం ఫెయిల్ అయ్యిందని చెప్పొచ్చు. ’’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే