ప్రత్యేక హోదాని సినిమాతో పోల్చడం బాధాకరం.. పవన్ పై లోకేష్

By ramya neerukondaFirst Published Nov 3, 2018, 11:31 AM IST
Highlights

ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని సినిమాతో పోల్చడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు.
 

బీజేపీయేతర శక్తులను ఏకం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై జనసేన అధినే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ధీటుగా స్పందించారు. బీజేపీని గద్దెదించడానికి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటును పవన్‌కల్యాణ్‌ ఫ్లాప్ షో అనడం సరికాదంటూ ట్వీట్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని సినిమాతో పోల్చడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు.

 

For a few, battle cry against Modi, and forming a national alliance to dethrone BJP in order to save Indian democracy and institutions is a flop show. Really sad to see our fight for AP’s special status be compared with a movie.

— Lokesh Nara (@naralokesh)

కాగా.. రైలు యాత్రలో పాల్గొంటున్న పవన్.. టీడీపీ-కాంగ్రెస్ పొత్తుల గురించి శుక్రవారం స్పందించారు. ఢిల్లీలో చంద్రబాబు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదని.. చంద్రబాబు సినిమా ప్లాప్ కావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 

more news

చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయం:పవన్ కళ్యాణ్

click me!