కారుపై దాడి: చంద్రబాబు, అచ్చెన్నాయుడిపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

By narsimha lode  |  First Published Jan 3, 2021, 12:21 PM IST

రామ తీర్థంలో తన కారుపై జరిగిన ఘటనపై వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 


న్యూఢిల్లీ: రామ తీర్థంలో తన కారుపై జరిగిన ఘటనపై వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఆలయాన్ని పరిశీలించిన తర్వాత ఆయన కారులో తిరిగి వెళ్లే సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది.

ఈ దాడిపై విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల డైరెక్షన్ లోనే తనపై దాడి జరిగిందని ఆయన చెప్పారు.

Latest Videos

undefined

రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.  విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు 307, 326, 427, 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

also read:ఏపీలో మరో ఆలయంపై దాడి: విజయవాడలో సీతారామ విగ్రహం ధ్వంసం

రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేయడానికి వెనుక టీడీపీ నేతలున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ విషయమై  అప్పన్న సన్నిధిలో ప్రమాణానికి తాను సిద్దంగా ఉన్నానని లోకేష్ సవాల్ విసిరారు. 

రామతీర్థంలో రాముడి విగ్రహన్ని ద్వంసం కావడం రాష్ట్ర రాజకీయాల్లో  సంచలనం చోటు చేసుకొంది. సంఘటన స్థలాన్ని చంద్రబాబునాయుడు పరిశీలించారు.ఇవాళ ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ లు ప,రిశీలించారు.

click me!