రైతుల కోసం దీక్ష చేస్తా.. జగన్ కు పవన్ కళ్యాణ్ అల్టిమేటం

By telugu news teamFirst Published Dec 5, 2020, 1:14 PM IST
Highlights

క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.

నివర్ తుఫాను ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. కాగా.. ఈ నేపథ్యంలో రైతుల బాధలను తెలుసుకునేందుకు పవన్ పర్యటన మొదలుపెట్టారు. ఈ రోజు నెల్లూరులో పర్యటించిన ఆయన రైతుల పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి వారికి జరిగిన నష్ట వివరాలను పవన్ తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నివర్ తుఫాను కారణంగా రైతులు తవ్ర ఇబ్బందులుపడ్డారని చెప్పారు. నష్టపోయిన రైతులకు భరోసా, మనో థైర్యం ఇవ్వడానికి తాను వచ్చినట్లు  చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే మూడోసారి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారని పవన్ చెప్పారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మద్యపానం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే.. ఈ నెల 7వ తేదీన రైతులకు మద్దతుగా దీక్ష చేపడతానని హెచ్చరించారు. అనంతరం తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి కూడా పవన్ మాట్లాడారు. ఆ ఎన్నికలు చూశాక.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం స్పష్టంగా అర్థమౌతోందని చెప్పారు. 

తిరుపతి ఉప ఎన్నిక కోసం తాము సమన్వయ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. స్థానిక న్యాయకత్వం, అభిప్రాయాలు తీసుకొని తిరుపతి ఉప ఎన్నిక విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

click me!
Last Updated Dec 5, 2020, 1:16 PM IST
click me!