సంచలనం: టిడిపి ఎంఎల్ఏ ‘ఆమంచి’ మైన్స్ సీజ్

Published : Feb 23, 2018, 01:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
సంచలనం: టిడిపి ఎంఎల్ఏ ‘ఆమంచి’ మైన్స్ సీజ్

సారాంశం

ఎంల్ఏతో పాటు కుటుంబసభ్యులు, అనుచరులు పలు ఇసుక క్వారీలను అక్రమంగా మైనింగ్ చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి.

టీడీపీ చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఇసుక క్వారీలను సీజ్ అయ్యాయి. ఎంల్ఏతో పాటు కుటుంబసభ్యులు, అనుచరులు పలు ఇసుక క్వారీలను అక్రమంగా మైనింగ్ చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి. అయితే, ఆరోపణలను అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. ఇసుక అక్రమ దందాలే కాకుండా అనేక ఇతర ఆరోపణలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.

పోయిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి ఆమంచి గెలవటం అప్పట్లో పెద్ద సంచలనం. అటువంటిది గెలిచిన తర్వాత టిడిపి అసోసియేట్ సభ్యునిగా చేరారు. దాంతో అప్పటి నుండి టిడిపి సభ్యునిగానే ఆమంచి చెలామణి అవుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేస్తున్న క్వారీలపై ఆరోపణలు పెరిగిపోయాయి. టిడిపిలోనే ఉన్న ఆమంచి ప్రత్యర్ధులు కూడా క్వారీయింగ్ పై పలు ఆరోపణలు చేసారని సమాచారం. దాంతో అధికారులు మైనింగ్ పై దృష్టిపెట్టారు. చివరకు బుధవారం నాడు మొదలైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

అధికారులు జరిపిన దాడుల్లో అక్రమ లావాదేవీలు బయటపడినట్ల సమాచారం. దాంతో ఇప్పటికి 6 క్వారీలను సీజ్ చేశారు. చినగంజాం మండలంలోని కడవకుదురులోని రెండు క్వారీలతో పాటు వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లిలో ఉన్న 4 క్వారీలను సీజ్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech: లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవంలో మంత్రి నారాలోకేష్ | Asianet News Telugu
Weather Alert: ఆరేబియా సముద్రం వైపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుందంటే