
2022 సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్సార్ అవార్డ్స్‌ను ఏపీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ అచీవ్‌మెంట్ పురస్కారాలను ప్రకటించారు. దీనిలో భాగంగా శిరీష రిహాబిలిటేషన్ సెంటర్, రంగస్థల నటుడు నాయుడు గోపి, కళంకారి కళాకారుడు పిచ్చుక శ్రీనివాస్, రచయిత శాంతి నారాయణ, బీవీ పట్టాభిరామ్, బండారు శ్రీనివాసరావు, సతీశ్ చంద్ర, మంగు రాజగోపాల్, ఎన్ఈవీ ప్రసాద్, కృష్ణ ఎల్లా, ప్రతాప్ సి రెడ్డిలకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ప్రకటించారు. అలాగే దర్శక దిగ్గజం , కళాతపస్వి కే.విశ్వనాథ్‌కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.