చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ల గుండెల్లో నిద్రపోతా.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు.. చంద్రబాబు నాయుడు

By SumaBala BukkaFirst Published Oct 14, 2022, 1:58 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పోలీసు వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందని, చట్టాన్ని అతిక్రమిస్తే వారి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు.

అమరావతి : ‘చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి.. మీ గుండెల్లో నిద్రపోతా..  తప్పుచేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.  చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులకు శిక్ష తప్పదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. శుక్రవారం టిడిపి  లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టీడీపీ అని... ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు టిడిపికి వచ్చాయని తెలిపారు. టీడీపీకి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది అన్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తన జీవితంలో ఊహించలేదని తెలిపారు. ఈ నెలలో వ్యక్తిగతంగా ప్రవర్తించలేదని తెలిపారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీసు శాఖలో కొందరిని పెట్టుకున్నారని ఆరోపించారు.

ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు మూడు రాజధానులు: జగన్ పై చంద్రబాబు ఫైర్

వివేకా హత్య కేసు తర్వాత ఇద్దరు చనిపోయారని.. అప్రూవర్ దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నాడు అని అన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజును కస్టడీలోకి తీసుకుని పోలీసులు వేధించారని అన్నారు. రఘురామపై పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపారు. ‘రఘురామాకు ఏపీకి రాలేని పరిస్థితిని కల్పించారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు.

ఎవరికి అన్యాయం జరిగినా టిడిపి అండగా ఉంటుందని.. భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి ఒప్పుకుని.. అధికారంలోకి రాగానే  జగన్ మాట మార్చారని ఆగ్రహించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కోర్టు మొట్టికాయలు వేసినా జగన్ తీరు మారటం లేదు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి ఏపీని సర్వనాశనం చేశారని అన్నారు. పోలవరాన్ని ముంచేశారని,  విశాఖను తొల్చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

click me!