ట్రావెల్ బ్యాన్ పై న్యాయపోరాటం ?

Published : Jul 12, 2017, 09:29 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ట్రావెల్ బ్యాన్ పై న్యాయపోరాటం ?

సారాంశం

ఎవరెంత చెప్పినా వినని ఎంపి విమానయాన సంస్ధలపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. విమానాల్లో ప్రయాణం చేయకుండా తనను ఏ సంస్ధ కూడా నిషేధంచలేందని అంటున్నారు. తన ప్రవర్తనను మాత్రం మార్చుకోరట. కానీ తనను మాత్రం విమానాల్లో ప్రయాణం చేయటానికి అనుమతించాలట.

కోతిపుండును బ్రహ్మరాక్షసిని చేసుకోవటం ఎలాగో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి తెలిసినట్లు ఇంకెవరికీ తెలీదేమో. చేసిందే తప్పు. పైగా దాన్ని సమర్ధించుకుంటున్నారు. చేసింది తప్పని హుందాగా ఒప్పుకుని, క్షమాపణ చెప్పుకుని వివాదాన్ని సర్దుబాటు చేసుకోవాల్సిందిపోయి విమానయాన సంస్ధలపై న్యాయపోరాటం చేస్తారట. ప్రజాప్రతినిధిగా ఉంటూ నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అందరి ముందు తలవంచుకునే స్ధితికి వచ్చారు.

 

ఆమధ్య విశాఖపట్నం విమానశ్రయంలో ఇండిగో విమాన సిబ్బందిపై బోర్డింగ్ పాస్ ఇవ్వలేదంటూ జెసి వీరంగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా? నిబంధనల ప్రకారం విమానం బయలుదేరే గంటముందు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. కానీ సమయం అయిపోయిన 50 నిముషాల తర్వాత వచ్చి బోర్డింగ్ పాస్ కోసం గొడవ చేసారు. ఆ గొడవ తర్వాత పరిణామాలు అన్నీ అందరికీ తెలిసినవే.

 

దానిపై విమానసిబ్బంది విమానాశ్రయ అధికారులకు చేసిన ఫిర్యాదుతో విచారణ జరిపారు. విచారణలో జెసి తప్పు స్పష్టంగా బయటపడింది. ఎలాగంటే, జెసి వీరంగం మొత్తం సిసి కెమెరాల్లో రికార్డయింది. దాంతో ఎంపిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తో దేశీయ విమానయాన సంస్ధలన్నీ జెసిపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఆమధ్య శివసేన ఎంపిపై విధించిన బ్యాన్ లాంటిదే లేండి.

 

జరిగిన ఘటనపై పశ్చాతాపం వ్యక్తం చేయాల్సిన ఎంపి ప్రతిష్టకు పోయారు. తానసలు తప్పే చేయలేదని, తప్పంతా విమాన సిబ్బందిదేనంటూ ఎదురుదాడికి దిగారు. తానెవరికీ క్షమాపణ చెప్పనని అవసరమైతే రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. మొత్తం ఘటనను విచారించిన కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, జరిగిన ఘటనలో జెసిదే తప్పని తేల్చేసారు. అయినా జెసి వెనక్కు తగ్గలేదు. మొన్ననే చంద్రబాబు మాట్లాడుతూ, ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

 

ఎవరెంత చెప్పినా వినని ఎంపి విమానయాన సంస్ధలపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. విమానాల్లో ప్రయాణం చేయకుండా తనను ఏ సంస్ధ కూడా నిషేధంచలేందని అంటున్నారు. తన ప్రవర్తనను మాత్రం మార్చుకోరట. కానీ తనను మాత్రం విమానాల్లో ప్రయాణం చేయటానికి అనుమతించాలట. ఎలాగుంది జెసి ఆలోచన? రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలనుకున్న జెసికి ఓ విమాన సంస్ధ బోర్డింగ్ పాస్ నిరాకరించింది లేంది. దాంతో ఎంపి అహం దెబ్బతింది. అందుకనే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక ఊపిరి పీల్చుకొండి.. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గేది ఎప్పట్నుంచో తెలుసా?
నెల్లూరు లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: Christmas Celebrations in Nellore | Asianet News Telugu