అటెండర్లతో వ్యక్తిగత పనులు: వెలిగొండ ఎస్‌డీసీపై కలెక్టర్ కు ఫిర్యాదు

By narsimha lodeFirst Published Aug 5, 2020, 4:13 PM IST
Highlights

తన కార్యాలయంలో పనిచేసే అటెండర్లతో ఓ అధికారి ఊడిగం చేయించుకొంటున్నారు. తన వ్యక్తిగత పనులను చేయించుకొంటున్నాడు. అంతేకాదు ఆయన వ్యవహర శైలి రాచరికపు పోకడలను గుర్తు చేస్తున్నాయి. 

బేస్తవారిపేట: తన కార్యాలయంలో పనిచేసే అటెండర్లతో ఓ అధికారి ఊడిగం చేయించుకొంటున్నారు. తన వ్యక్తిగత పనులను చేయించుకొంటున్నాడు. అంతేకాదు ఆయన వ్యవహర శైలి రాచరికపు పోకడలను గుర్తు చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారి ప్రవర్తనతో అటెండర్లు కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్‌ భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఎన్. విజయ్ కుమార్ పనిచేస్తున్నారు. అయితే ఆయన తన వద్ద పనిచేసే అటెండర్లతో స్వంత పనులు చేయించుకొంటున్నారని కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం నుండి హౌస్‌ రెంట్, టీఏ, డీఏ పొందుతూ కార్యాలయంలోనే నివాసం ఉంటున్నాడు.

కంభంలో నివాసం ఉండే అటెండర్ అనిల్ ఉదయం ఐదు గంటటలకే వేడీనీళ్లు, కాఫీ తీసుకురావాలి. అటెండర్లు కాళ్లు పట్టాలి, అవసరమైతే ఆయన ఒంటికి మసాజ్ చేయాలి. ఆయన బట్టలను ఉతికి ఇస్త్రీ చేయాల్సిందే. ఈ పనులు చేయని అటెండర్లనను ఆయన బూతులు తిడతాడని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ పనులు చేయకపోతే ఉద్యోగం నుండి తీసేస్తామని బెదిరించడంతో అటెండర్లు ఏడాది కాలంగా ఈ పనులు చేస్తున్నారు. మురళి అనే అటెండర్ కు డ్రైవింగ్ కూడ వచ్చు. దీంతో ఆయనను తన డ్రైవర్ గా ఉపయోగించుకొంటున్నాడు. నెల్లూరు, విజయవాడ, కడప ప్రాంతాల్లో తన సొంత అపార్ట్‌మెంట్లకు మురళిని తీసుకెళ్తాడు. అక్కడే నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తోందని బాధితుడు కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.

ఆఫీసు ఫర్నీచర్ ను కూడ ఆయన తన ఇంటికి తరలించేవాడని అటెండర్లు తెలిపారు. ఎస్ డీ సీకి స్వంత పనులు చేయడంతో పాటు రాత్రి పూట కూడ కాపలాగా ఉండాల్సిన  పరిస్థితులు ఉన్నాయని వారు ఆరోపించారు.ఈ మేరకు తమ ఫిర్యాదులను కలెక్టర్ తో పాటు సీఎం కార్యాలయానికి కూడ పంపారు.

click me!