జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ఊరట: బెయిల్ మంజూరు చేసిన అనంతపురం కోర్టు

By narsimha lodeFirst Published Aug 5, 2020, 3:15 PM IST
Highlights

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ ఆస్మిత్ రెడ్డిలకు అనంతపురం జిల్లా కోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ కడప జైలులో ఉన్నారు. బెయిల్ పేపర్లను కడప జైలుకు పంపితే రేపు వీరిద్దరూ విడుదలయ్యే అవకాశం ఉంది.


అనంతపురం:  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ ఆస్మిత్ రెడ్డిలకు అనంతపురం జిల్లా కోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ కడప జైలులో ఉన్నారు. బెయిల్ పేపర్లను కడప జైలుకు పంపితే రేపు వీరిద్దరూ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది జూన్ 13వ తేదీన హైద్రాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. 

ఈ విషయమై అనంతపురంలోని జేసీ ఇంటి ముందు జూన్ మొదటివారంలో వాహనాలు కొనుగోలు చేసిన వారు ధర్నాకు దిగారు. మరో వైపు అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న దానిపై కూడా జేసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసి అశ్విత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

also read:జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి హైకోర్టు షాక్: బెయిల్ పిటిషన్ల తిరస్కరణ

ఈ కేసులపై వీరిని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం వీరు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. దీంతో అనంతపురం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి.


 

click me!