ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన ఏపీకి చెందిన వాహనం: ఐదుగురు సురక్షితం, మరో ఆరుగురి కోసం గాలింపు

Published : Jul 09, 2023, 11:34 AM IST
ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన  ఏపీకి చెందిన వాహనం: ఐదుగురు సురక్షితం, మరో ఆరుగురి కోసం గాలింపు

సారాంశం

ఉత్తరాఖండ్  రాష్ట్రంలోని  తెహ్రీ జిల్లా గులార్ లో  వాహనం అదుపు తప్పి లోయలో పడింది.  ఈ ప్రమాదంలో  ఐదుగురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.  మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్  రాష్ట్రంలోని తెహ్రీ జిల్లా గులార్ లో  వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ వాహనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని రవిరావు కుటుంబం ఉందని సమాచారం.  గులార్ వద్దకు  చేరుకున్న తర్వాత  వాహనం అదుపుతప్పి లోయలో పడింది.  ఈ ప్రమాదంలో వాహనంలోని ఐదుగురిని రక్షించారు. మరో ఆరుగురి కోసం  రెస్క్యూ బృందం  గాలింపు చర్యలు చేపట్టింది. శ్రీనగర్- బద్రీనాథ్ హైవేపై  ఈ ప్రమాదం జరిగింది. 

 

ఉత్తరాఖండ్ లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  కొండ ప్రాంతాల్లో అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. దరిమిలా  చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి.  భారీ వర్షాల కారణంగా కల్కా-సిమ్లా  మార్గంలో రైల్వే ట్రాక్ మూసివేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా  ఉత్తరాది ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.   ఈ రుతుపవనాల కారణంగా ఉత్తరాఖండ్ లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో 3 కొత్త జిల్లాలు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ప‌రుగులు ఖాయం
Wine Shop: మందు బాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్ ఓపెన్