Guntur: కృష్ణానదిలో సంధ్యావందనానికి దిగి ఆరుగురు దుర్మరణం... పోలీసులకు హోంమంత్రి కీలక ఆదేశాలు (Video)

By Arun Kumar PFirst Published Dec 11, 2021, 10:11 AM IST
Highlights

సంధ్యావందనానికి  కృష్ణా నదిలో దిగిన వేదపాఠశాల ఉపాధ్యాయుడితో పాటు ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: సంద్యావందనం కోసం నదిలోకి దిగిన వేదపాఠశాల విద్యార్థులు ప్రవాహదాటికి కొట్టుకుపోయి మృత్యువాతపడిన విషాద ఘటన గుంటూరు జిల్లా (guntur district)లో చోటుచేసుకుంది. శ్వేత శృంగాచలం వేద పాఠశాల (swetha sringachalam vedic school)కు చెందిన ఓ ఉపాధ్యాయుడు, ఐదుగురు విద్యార్థులు అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో కృష్ణా నది (krishna river)లో సంద్యావందనాని దిగి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhushan harichandan) తో విద్యా, హోంశాఖ మంత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. 

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న విషాద సంఘటన పట్ల తీవ్ర  దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, విద్యార్థులు ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి మృతి చెందటం విచారకరమన్నారు. 

Video

మృతులు హర్షిత్‌ శుక్లా, శుభమ్‌ త్రివేది, అన్షుమన్‌ శుక్లా, శివ శర్మ, నితేష్‌ కుమార్‌ దిక్షిత్‌ కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో వివిధ సంస్థల యాజమాన్యాలు మరింత శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సూచించారు. ఈ మేరకు రాజ్ భవన్ (ap raj bhavan) నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

read more  విషాదం : కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి

కృష్ణానదిలో మునిగి వేదపాఠశాల విద్యార్థులు మృతిచెందిన దుర్ఘటనపై హోంమంత్రి మేకతోటి (mekathoti sucharitha) సుచరిత విచారం వ్యక్తంచేసారు. ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి. 

వేద పాఠశాలకు చెందిన ఆరుగురు చనిపోవడం అత్యంత భాదకరమన్నారు. విద్యార్థుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించిన హోంమంత్రి సుచరిత తెలిపారు. 

వేద పాఠశాల విద్యార్థుల మృతిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) స్పందించారు. కృష్ణా నదిలోకి దిగి విద్యార్థులు మరణించటం దురదృష్టకరమన్నారు. సంఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మంత్రి సురేష్. విద్యార్థుల మృతికి సంతాపం తెలిపిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

read more  నెల్లూరులో ఘోర ప్రమాదం : ఆటోను ఢీకొట్టిన లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణీకులు, గాలింపు

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు, ఐదుగురు విద్యార్థులను తీసుకుని సమీపంలోని కృష్ణానదిలో సంధ్యావందనానికి వెళ్లాడు. అయితే నదిలో నీటి ప్రవాహఉదృతి ఎక్కువగా వుండటంతో వీరంతా కొట్టుకుపోయారు. ఇది గమనించిన కొందరు వారిని కాపాడే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మృతులను హర్షిత్‌ శుక్లా, శుభమ్‌ త్రివేది, అన్షుమన్‌ శుక్లా, శివ శర్మ, నితేష్‌ కుమార్‌ దిక్షిత్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!