Sulur chopper crash: సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన వైఎస్ జగన్

By narsimha lode  |  First Published Dec 11, 2021, 10:01 AM IST


తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.



అమరావతి: తమిళనాడులోని  నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో  మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల ex gratia అందించనున్నట్టుగా ప్రకటించింది. నీలగిరి కొండల్లో మరణించిన లాన్స్ నాయక్ త్వరలోనే తిరుమలకు వచ్చేందుకు టూర్ ప్లాన్ చేసుకొన్నట్టుగా కుటుంబసబ్యులకు చెప్పారు. ప్రమాదానికి ముందు రోజే ఆయన తన సోదరుడితో ఈ విషయమై ఫోన్ లో మాట్లాడారు. సాయితేజది చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఎగువరేగడ గ్రామం. Sai teja డెడ్‌బాడీని స్వగ్రామానికి తీసుకురానున్నారు.  డీఎన్ఏ పరీక్షల తర్వాత సాయితేజ మృతదేహన్ని గుర్తించారు. ఇవాళ సాయితేజ మృతదేహన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. Sulur chopper crash ఘటనలో  ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మరణించారు. వీరిలో సాయితేజ కూడా ఉన్నారు. ఈ ఘటన  దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. సాయితేజ కుటుంబానికి ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ. 50 లక్షల చెక్ ను శనివారం నాడు అందించనున్నారు. 

ఃalso read:Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం గుర్తింపు.. నేడు స్వస్థలానికి తరలింపు..

Latest Videos

undefined

సాయితేజతో పాటు మరో నాలుగు మృతదేహలను అధికారులు గుర్తించారు సాయితేజ మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ఇవాళ స్వగ్రామంలో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  సాయితేజీ కుటుంబానికి రూ. కోలి రూపాయాల పరిహరం ఇవ్వాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జగన్ సర్కార్ రూ. 50 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. 

ఎగువరేగడలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు సాయితేజ, మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే  సైన్యంలో చేరారు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి 11వ పారా లాన్స్‌ నాయక్‌ హోదా దక్కించుకున్నాడు.  ఏడు నెలల క్రితమే జనరల్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO to the CDS) నియమితులయ్యారు. సాయితేజ సోదరుడు మహేష్‌బాబు కూడా సైన్యంలోనే ఉన్నారు.

సాయితేజకు భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ (5), దర్శిని (2) ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితమే సాయితేజ.. తన కొడుకు మోక్షజ్ఞ ప్రాథమిక విద్య కోసం గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి తన భార్యాపిల్లలను మార్చారు. చివరి సారిగా వినాయకచవితికి సాయితేజ ఇంటికి వచ్చారు. జనవరిలో సంక్రాంతి పండగకు వస్తానని కుటుంబ సభ్యులతో తెలిపారు. సాయితేజ రోజు భార్య, పిల్లలతో ఫోన్‌లో మాట్లాడేవారు. బుధవారం కూడా సాయితేజ.. భార్యకు వీడియో కాల్ చేశారు. సాయి తేజ మృతిచెందారనే వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లె‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయితేజ‌ తల్లిదండ్రులు, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


 

click me!