ఒట్ల లెక్కింపు ఎఫెక్ట్: వినూత్నంగా పెళ్లి పత్రిక

By narsimha lodeFirst Published May 13, 2019, 11:16 AM IST
Highlights

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త వినూత్నంగా పెళ్లి పత్రికను ముద్రించి బంధువులు, స్నేహితులకు పంచారు.తమ కూతురు వివాహానికి అందరూ హాజరయ్యే విధంగా ఉండేందుకు వీలుగా ఆయన ఈ ఏర్పాటు చేశారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త వినూత్నంగా పెళ్లి పత్రికను ముద్రించి బంధువులు, స్నేహితులకు పంచారు.తమ కూతురు వివాహానికి అందరూ హాజరయ్యే విధంగా ఉండేందుకు వీలుగా ఆయన ఈ ఏర్పాటు చేశారు.

తెలంగాణ, ఏపీ  రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.  ఎన్నికల ఫలితాల కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

నెల్లూరు పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి బయ్య వాసు తన కుమార్తె వివాహన్ని ఈ నెల 23వ తేదీ ఉదయం 11.51 గంటలకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

అయితే అదే రోజు ఎన్నికల ఫలితాలు వస్తున్నందున పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు  సౌకర్యంగా  ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా వివాహా ఆహ్వాన పత్రికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని  ఈ పెళ్లికి హాజరుకాకుండా ఎవరైనా ఉండే అవకాశం ఉందని భావించి.....  ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షించే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు.  
 

click me!