ఆసక్తికరం:చంద్రబాబుతో తొలిసారి సీఎస్ ఎల్వీ భేటీ

By narsimha lodeFirst Published May 13, 2019, 10:55 AM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం నాడు భేటీ కానున్నారు. ఈ నెల 14వ తేదీననిర్వహించతలపెట్టిన కేబినెట్ భేటీ‌కి సంబంధించి చ ర్చించే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం నాడు భేటీ కానున్నారు. ఈ నెల 14వ తేదీననిర్వహించతలపెట్టిన కేబినెట్ భేటీ‌కి సంబంధించి చ ర్చించే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

 ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ఏపీ సీఎం తలపెట్టారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహణకు సంబంధించిన ఎజెండానే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం పంపారు.

ఇప్పటికే 48 గంటలు దాటింది. అయినా కూడ కేబినెట్ ఎజెండాపై ఈసీ నుండి స్పష్టత రాలేదు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రస్తుతం సెలవులో ఉన్నారు.సెలవులకు వెళ్లే ముందు గోపాలకృష్ణ ద్వివేది ఈసీకి ఎజెండా కాపీని పంపారు. సోమవారం నాటికి కేంద్ర ఎన్నికల సంఘం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉందని  భావించారు. ఇవాళ సాయంత్రానికి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యేందుకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చంద్రబాబునాయుడు నివాసానికి చేరుకొన్నారు. ఏపీ కేబినెట్‌‌ విషయమై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

ఏపీ సీఎస్‌గా ఉన్న అనిల్ పురేఠ స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యాన్ని  ఎన్నికల సంఘం నియమించడాన్ని చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. ఎల్వీ సుబ్రమణ్యం వ్యవహరశైలిపై టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.

మరో వైపు చంద్రబాబునాయుడుపై ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్వీ సుబ్రమణ్యంచేసిన వ్యాఖ్యలు కూడ తీవ్ర దుమారం లేపాయి. ఈ విషయమై చంద్రబాబునాయుడు వివరణ కూడ కోరిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఇంకా రాని ఈసీ అనుమతి: చంద్రబాబు కేబినెట్ భేటీపై సస్పెన్స్

 

click me!