విశాఖ కిడ్నీ రాకెట్: ఇద్దరు డాక్టర్లు సహా ముగ్గురి అరెస్ట్

By narsimha lodeFirst Published May 13, 2019, 10:37 AM IST
Highlights

 విశాఖపట్టణం కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలను వెల్లడించినట్టుగా సమాచారం. కిడ్నీ రాకెట్‌ విషయంలో  మూడు రాష్ట్రాలకు లింకు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. 

విశాఖపట్టణం: విశాఖపట్టణం కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలను వెల్లడించినట్టుగా సమాచారం. కిడ్నీ రాకెట్‌ విషయంలో  మూడు రాష్ట్రాలకు లింకు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. 

విశాఖపట్టణంలోని శ్రద్ద ఆసుపత్రి కేంద్రంగా కిడ్నా రాకెట్ కొనసాగిసట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా  సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఏ1 మంజునాథ్, ఏ3 డాక్టర్ ప్రభాకర్‌ను పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల నుండి పోలీసులు కస్టడీకి తీసుకొని  విచారించారు. శ్రద్ద ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ జేకే వర్మను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వర్మను కూడ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.  ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్మను విచారిస్తే ఈ విషయమై మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని  పోలీసులు భావిస్తున్నారు.

శ్రద్ద ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ జేకే వర్మ ఆధ్వర్యంలోనే కిడ్నీల దందా సాగినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసు విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ భాస్కర్‌  త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శ్రద్ద ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించే అవకాశం ఉంది.

విశాఖలోని శ్రద్ద ఆసుపత్రిలోనే ఈ రకమైన వ్యవహరాలు చోటు చేసుకొన్నాయా.. అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. మరో వైపు జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో కూడ సుమారు పదేళ్లుగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహరానికి సంబంధించి మూడు రాష్ట్రాలతో లింకు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విషయంలో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

click me!