చంద్రబాబు ఇలాకాలో వైసిపి అక్రమాలివీ...: అటవీ అధికారికి వర్ల రామయ్య లేఖ

Arun Kumar P   | Asianet News
Published : Dec 09, 2021, 03:07 PM ISTUpdated : Dec 09, 2021, 03:15 PM IST
చంద్రబాబు ఇలాకాలో వైసిపి అక్రమాలివీ...: అటవీ అధికారికి వర్ల రామయ్య లేఖ

సారాంశం

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని అడవులను వైసిపి నాయకులు విధ్వంసం చేస్తున్నారంటే అటవీశాఖ ఉన్నతాధికారులకు వర్ల రామయ్య లేఖ రాసారు. 

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అధికార వైసిపి (ysrcp) నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (varla ramaiah) ఆరోపించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కంగుండి అటవీ ప్రాంతంలో వైసీపీ నేతలు అడవులను ధ్వంసం చేస్తూ అక్రమాలకు తెరలేపారంటూ చీఫ్ కన్జర్వేటర్ అధికారి (Chief Conservator of Forests) ఎన్. ప్రతాప్ కుమార్ కు రామయ్య లేఖ రాసారు. 

''కుప్పం (kuppam) నియోజకవర్గ పరిధిలోని కంగుండి అటవీ ప్రాంతాన్ని వైసిపి నాయకులు విధ్వంసం చేస్తున్నారు. ఈ అటవీప్రాంతంలో 15 అడుగుల వెడల్పుతో అక్రమంగా పైప్‌లైన్‌ను వేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొంతమంది అధికార పార్టీ నేతలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న పెద్ద పెద్ద చెట్లను నేల కూలుస్తున్నారు'' అని రామయ్య ఫిర్యాదు చేసారు. 

''అటవీప్రాంతాన్ని విధ్వంసంపై 2021 సెప్టెంబర్‌లో స్థానిక చిత్తూరు (chittor district) ప్రజలు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(DFO) దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు'' అని పేర్కొన్నారు. 

read more  కేవీపీ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారా?.. సీబీఐకి హైకోర్టు సూటి ప్రశ్న...

''ఏనుగుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కౌండిణ్య ఏనుగుల అభయారణ్యం ప్రాజెక్ట్ పలమనేరు కుప్పం అటవీ ప్రాంతంలోనే ఉన్నది. కుప్పం రేంజ్ లో ఉన్న ఫారెస్ట్ బ్లాక్‌ లలో కంగుండి అటవీ ప్రాంతం కూడా ఒకటి. అలాంటి అటవీ ప్రాంతాన్ని నేరస్థులు, స్మగ్లర్ల నుండి రక్షించాల్సిన అవసరం ఉంది. కావున అటవీ (సంరక్షణ) చట్టం, 1980, వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 ప్రకారం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను'' అని చీఫ్ కన్జర్వేటర్ అధికారికి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు. 

ఇక కుప్పం నియోజకవర్గంపై తన పట్టును నిలుపుకునేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంభించారు. సొంత జిల్లా చిత్తూరులోని తన నియోజకవర్గమైన కుప్పం (kuppam) నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ కుప్ప మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారని.. వారిని ఏరి పారేస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలో ఇకపై సమర్థులకే పట్టం కడతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  

READ MORE  ఆ పార్టీ నేత‌ల ఇండ్ల‌లో దోచుకోండి.. దాచుకోండి.. చెడ్డీ గ్యాంగ్‌కు జనసేన నేత సలహాలు

తనను మెప్పించడం కోసం ప్రయత్నించే వారికి కాకుండా ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వారికే సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు. అధికారంలోకి రాగానే అరాచక శక్తులు చేసిన పనులను వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు  హెచ్చరించారు. బాంబులకే భయపడలేదు... ఈ పొలిటికల్ క్రిమినల్స్ కు భయపడతామా అని ప్రశ్నించారు. స్థానిక నాయకుల అతివిశ్వాసం వల్లే కుప్పంలో ఓటమి పాలయ్యామన్న చంద్రబాబు.. వార్డుల వారీగా రహస్య నివేదికలు ఇవ్వాలని అభ్యర్థులను ఆదేశించారు.

కుప్పంలో పార్టీ పటిష్టానికి సమర్థులైన నాయకులతో కోఆర్డడినేషన్ కమిటీ (Co-ordination Committee) ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల రోజు మహిళల పోరాట పటిమకు చంద్రబాబు కితాబునిచ్చారు. కుప్పం నేతలతో దాదాపు మూడు గంటల పాటు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?