Guntur Accident: రోడ్డుపక్కన నిద్రిస్తున్న వృద్దురాలి పైనుండి దూసుకెళ్ళిన కారు

Arun Kumar P   | Asianet News
Published : Dec 09, 2021, 01:37 PM ISTUpdated : Dec 09, 2021, 01:57 PM IST
Guntur Accident: రోడ్డుపక్కన నిద్రిస్తున్న వృద్దురాలి పైనుండి దూసుకెళ్ళిన కారు

సారాంశం

తలదాచుకోడానికి గూడు లేక రోడ్డుపైనే నిద్రిస్తున్న ఓ అభాగ్యురాలి పైనుండి కారు దూసుకెళ్లిన దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. 

గుంటూరు: ఆమెకు దిక్కూ మొక్కు లేరు. కనీసం వుండడానికి ఇళ్లు కూడా లేదు. దీంతో రోడ్డుపక్కనే జీవనం సాగిస్తున్న ఆ అభాగ్యురాలు బుధవారం రాత్రి ప్రమాదానికి గురయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా (guntur district) సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.

 సత్తెనపల్లి (sattenapalli)లో ఓ వృద్దురాలు రాత్రి రోడ్డుపక్కన నిద్రిస్తుండగా గుర్తుతెలియని కారు డీకొట్టింది. రాత్రి సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఆమె పైనుండి దూసుకెళ్లింది. ప్రమాదం (accident) తర్వాత కారు ఆగకుండా అదే వేగంతో వెళ్ళిపోయింది. 

ఈ ప్రమాదాన్ని గమనించిన కొందరు కారును ఆపే ప్రయత్నం చేసారు. అయితే వారికి చిక్కకుండా కారును వేగంగా పోనిచ్చి తప్పించుకున్నారు. ఇక కారు శరీరంపైనుండి వెళ్లడంతో వృద్దురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వృద్దురాలి పరిస్థితి విషమంగానే వుందని సమాచారం. 

read more  Visakhapatnam: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడు దుర్మరణం

ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదస్థలికి దగ్గర్లోని సిసి కెమెరాల ఆధారంగా యాక్సిడెంట్ కు కారణమైన కారును గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.   

ఇదిలావుంటే విశాఖపట్నం (visakhapatnam)లో జరిగిన రోడ్డు ప్రమాదం (road accident) ముగ్గురిని బలితీసుకుంది. మధురవాడలో ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్యాభర్తలు, కుమార్తె ఉన్నారు. లారీ వీరి పైనుండి దూసుకెళ్లడంతో శరీరాలు చిద్రమయ్యాయి.

చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా జాతీయ రహదారిపై బైక్‌‌పై వెళ్తున్న వారిని ఓ లారీ ఢీకొట్టింది. మృతులను పోలిపిల్లి రమణ, అతని భార్య రాంబాయ్, కుమార్తె శాంతి కుమారి‌గా గుర్తించారు. వీరు విజయనగరం జిల్లా పోలిపిల్లిలో బుధవారం ఓ ఫంక్షన్‌కు హాజరై గురువారం తెల్లవారుజామున తమ స్వగృహానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. 

 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu