జీవో నెంబర్ 59 వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అసలు ఆ జీవోలో ఏముందంటే..

By Sumanth KanukulaFirst Published Dec 9, 2021, 2:54 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి సంబంధించిన గతంలో జారీచేసిన జీవో నెంబర్ 59 ని (GO  No. 59) ఉపసంహరించుకుంటున్నట్టుగా ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి సంబంధించిన గతంలో జారీచేసిన జీవో నెంబర్ 59 ని (GO  No. 59) ఉపసంహరించుకుంటున్నట్టుగా ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గురువారం జీవో నెంబర్ 59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇక, ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని మహిళా పోలీసులుగా పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణిస్తూ 2021 జూన్ నెలలో ఏపీ ప్రభుత్వంపై ఈ జీవో జారీచేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. జివోను సస్పెండ్ చేయాలని పిటిషనర్ కోరారు.

ఇందుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతంది. పిటీషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. గ్రామ, వార్డు కార్యదర్శులకు కానిస్టేబుళ్లుగా మార్చి వారికి పోలీసు డ్రస్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అయితే ఈ క్రమంలోనే జీవో నెం.59ను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. డ్రెస్‌ కోడ్‌ను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. వారిని ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఈ  విచారణను మరో వారం పాటు వాయిదా వేసింది. 
 

click me!