కొడాలి నాని క్యాసినో రగడ.. విచారణ కోరుతూ డీజీపీకి వర్లరామయ్య లేఖ...

By SumaBala Bukka  |  First Published Mar 28, 2022, 2:00 PM IST

గుడివాడలో కొడాలి నాని క్యాసినో నిర్వహణ మీద రేగుతున్న రచ్చ ఇంకా ఆగేలా లేదు. తాజాగా దీనిమీద ఎంక్వైరీ చేయించాలంటూ కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. 


విజయవాడ : గుడివాడలో అక్రమ క్యాసినో నిర్వహించిన మంత్రి Kodali Nani అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు varla ramaiah డీజీపి లేఖ రాశారు. గుడివాడ నియోజకవర్గంను మంత్రి కొడాలి నాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యేక చట్టం, రాజ్యాంగం అమలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలపై కొడాలి నాని, అతని అనుచరులు వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు.

గుడివాడలో కొడాలి నాని పీనల్ కోడ్, రాజ్యాంగం అమలులో ఉందని అందరూ అనుకుంటున్నారు. జనవరి 2022లో గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు మీ కార్యాలయానికి అనేక లేఖల ద్వారా నివేదించబడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2015లో లంకా విజయ్ మరణం వాస్తవానికి రైలు ప్రమాదంగా మార్చబడిన ఆత్మహత్య. అడపా బాబ్జీ మృతికి కొడాలి నాని వేధింపులే కారణమని అందరూ అనుకుంటున్నారు.

Latest Videos

undefined

ఈ నేపథ్యంలో కొడాలి నాని చట్టాలకు అతీతుడు కాదని ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలి. అక్రమ క్యాసినో నిర్వహణపై తీసుకున్న చర్యలతోపాటు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నివేదికను కూడా బహిర్గతం చేయాలని అభ్యర్థిస్తున్నాను... అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, సంక్రాంతి సందర్బంగా చెలరేగిన ఈ వివాదంలో గుడివాడలోని జనవరి 21న కొడాలి నాని స్పందిస్తూ.. తన కళ్యాణ మండపం రెండున్నర ఎకరాలు వుంటుందని.. దానిలో క్యాసినో, పేకాట వంటివి నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని  సవాల్ విసిరారు. గుడివాడలో టీడీపీనిజ నిర్ధారణ కమిటీ సభ్యుల రాకను నిరసిస్తూ శుక్రవారం వైసీసీ శ్రేణులు ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు కొడాలి నాని. 

చంద్రబాబుకు టైం అయిపోయిందని.. ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లందరితో నిజ నిర్థారణ కమిటీ వేశారంటూ ఆయన దుయ్యబట్టారు. ప్రశాంతంగా వున్న గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గొడవలు పెడుతున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు. సంక్రాంతికి రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్లే గుడివాడలోనూ జూదం జరిగిందని ఆయన అంగీకరించారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం రావడంతో తాను స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని కొడాలి నాని తెలిపారు. 

తన కళ్యాణ మండపంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో లేదో చెప్పడానికి మీడియా, గుడివాడ ప్రజలు వున్నారని .. దీనికి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను  అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నాడు లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని.. నేడు భార్యను రోడ్డు మీదకు తీసుకొచ్చి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు. 

click me!