సిఐడి చీఫ్ సునీల్ కు అప్రధాన్య పోస్టు ఇవ్వండి: సీఎస్ కు వర్ల రామయ్య లేఖ

By Arun Kumar PFirst Published Jul 5, 2021, 10:09 AM IST
Highlights

ఏపీ సిఐడి చీఫ్  సునీల్ కుమార్ పై దర్యాప్తు నిస్పాక్షికంగా, త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను కోరారు టిడిపి నాయకులు వర్ల రామయ్య. 

అమరావతి:  కేంద్ర  హోం శాఖ ఆదేశాల ప్రకారం ఏపీ సిఐడి చీఫ్  సునీల్ కుమార్ పై దర్యాప్తు నిస్పాక్షికంగా, త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్ ను కోరారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఈ మేరకు సీఎస్ కు లేఖ రాశారు వర్ల.  

''సునీల్ కుమార్ రాష్ట్రంలో ప్రధానమైన పోస్టులో ఉన్నందున విచారణ పూర్తయ్యేంతవరకు అప్రధాన పోస్టులో ఉంచండి. విచారణ సమయంలో ఆయన సిఐడి చీఫ్ గా ఉంటే ఆ ప్రభావం విచారణ అధికారిపై  పడుతుంది. కాబట్టి వెంటనే ఆయనను బదిలీ చేయండి'' అని సీఎస్ కు సూచించారు. 

read more  సీఐడి చీఫ్ సునీల్ కుమార్ పై దేశద్రోహం కేసు: గవర్నర్ కు వర్ల లేఖ

''భాద్యతాయుతమైన పోస్టులో వుండి అనుచిత వ్యాఖ్యలు చేసిన సునీల్ కుమార్ పై గతంలో డి.జి.పి, గవర్నర్, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశాను. ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడిన ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని కోరాను''  అని వర్ల రామయ్య తెలిపారు. 

ఏపి సీఐడి చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఆదేశించింది కేంద్ర హోంశాఖ. ఆయనపై అందిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న హోంశాఖ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ని ఆదేశించింది. సీఐడి ఏడిజి పోస్టులో కొనసాగుతున్న సునీల్ కుమార్ సర్వీసెస్ రూల్స్ ఉల్లంఘిస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నాడని కేంద్ర హోంశాఖకు పలు పిర్యాదులు అందాయి.  ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర హోం శాఖ విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.  
 

click me!