జగన్ కు ఆగస్టు సంక్షోభం: జడ్జి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Jul 5, 2021, 8:40 AM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద జడ్జి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఆగస్టు సంక్షోభం తప్పదని ఆయన అన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తో భేటీ తర్వాత ఆయన మీడియోతో మాట్లాడారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆగస్టు సంక్షోభం తప్పదని న్యాయమూర్తి ఎస్. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఆదివారంనాడు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 

న్యాయపరమైన అంశాలను వెల్లడి చేయడం సరి కాదని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జనగ్ కు వచ్చే నెలలో చీకటి రోజులు ఖాయమని రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న కేసులో జగన్ ను నిందితుడిగా నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. 

తన స్వగ్రామం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట నుంచి త్వరలోని రాజధానిలోని గవర్నర్ బంగాల వరకు 60 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతున్నట్లుఆయన తెలిపారు. 

దళితులకు ప్రభుత్వం అందించాల్సిన సహాయం విషయంలో అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. వైఎస్ జగన్ పథకాలకు దళితులు ఆకర్షితులవుతున్నారని, గతంలోని పథకాలకే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

click me!