నేరచరితులకు పదవుల కోసం... సతీసమేతంగా గవర్నర్ వద్దకా!: వర్ల సీరియస్

By Arun Kumar PFirst Published Jun 19, 2021, 9:07 AM IST
Highlights

స్వతహాగా నేరస్తుడయిన సీఎం జగన్ తన చుట్టూ నేరస్తులనే ఉంచుకోడానికి ఇష్టపడతాడని టిడిపి నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. 

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా నేరస్తుడయిన సీఎంకు తన చుట్టూ నేరస్తులనే ఉంచుకోడానికి ఇష్టపడతాడని... అందుకోసమే మరో ఇద్దరు నేరస్తులను ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాడని రామయ్య సోషల్ మీడియా వేదికన మండిపడ్డారు. 

''ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నేరస్తులు నిర్భయంగా తిరుగుతున్నారు. నేరస్తులను ప్రశ్నించవలసిన వారు మనకెందుకులే అని ఉదాసీనతగా వుంటున్నారు. ముఖ్యమంత్రిపైనే ఇన్ని కేసులుంటే మనకేంటి భయమని ముద్దాయిల భావన. సీఎంకు తోడు, రేపు సహనిందుతురాలు శ్రీలక్ష్మిగారు చీఫ్ సెక్రటరీ అయినా ఆశ్చర్యం లేదు'' అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. 

''ముఖ్యమంత్రి గారికి నేరచరిత గలవారి పట్ల మక్కువెక్కువ. రాష్ట్రమంతా ఎరిగిన యిద్దరు నేరచరితులను ఎమ్యెల్సీ లుగా చేయడం కోసం సాక్షాత్తు సతీ సమేతంగా గవర్నర్ గారి వద్దకు వెళ్లారు. మంత్రిమండలిలో ,శాసనసభలో, పార్లమెంట్ సభ్యులుగా, సలహాదారులుగా, చైర్మన్లుగా, ఆయన చుట్టూ ఎందరో నేరచరితులు గదా?'' అంటూ ట్విట్టర్ వేదికన ఆరోపణలు చేశారు రామయ్య.

read more  వైఎస్ జగన్ బండారం బయటపెడ్తా, బెయిల్ రద్దు ఖాయం: గోనె ప్రకాశ్ రావు

ఇక ఇటీవలే సీఎం జగన్ ను దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడిగా రామయ్య అభివర్ణించాడు. ''దేశంలో స్టాంప్ పేపర్ల కుంభకోణంలో కరీం తెల్గీని అరెస్ట్ చేసిన ఘనత సిబిఐది,అతి పెద్ద ఆర్ధిక నేరంగా భావించే 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఘనత సిబిఐది. అటువంటి సిబిఐకి వివేకా హత్య కేసులో ముద్దాయిలను పట్టుకోడం పెద్ద కష్టం కాదు ఏదో శక్తి అడ్డు పడితే తప్ప'' అన్నారు. 

''ముఖ్యమంత్రి గారూ! మీ ఢిల్లీ యాత్ర, స్వామికార్యమా, స్వకార్యమా? స్వామి కార్యమంటే, ప్రజలకోసం. మరి స్వకార్యమంటే కేసులమాఫీ కోసం, బెయిల్ రద్దు కాకుండా, ఎంపీ రఘురామ కేసులో నష్టం భర్తీకోసం, ఆయన మొబైల్ కేసులో సీఐడీ అధికారుల రక్షణకోసం, థర్డ్ డిగ్రీ అధికారులను కాపాడడం కోసం. ఏదినిజం?'' అని ప్రశ్నించారు. 
 

click me!